AP: జగన్ టార్గెట్‌గా డిప్యూటీ సీఎం పవన్ దూకుడు పెంచారు. గాలివీడు ఘటనపై స్పందించిన పవన్.. ఫ్లైట్‌లో అక్కడికి వెళ్లి ఎంపీడీవోను పరామర్శించారు. జగన్‌ను టార్గెట్ చేసి.. మీ వారిని కంట్రోల్‌లో పెట్టుకో అంటూ సూటిగానే చెప్పేశారు. జగన్ పార్టీ వాళ్లు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని, రాయలసీమ వైసీపీ జాగీరు కాదన్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే కడపలో క్యాంప్ ఆఫీస్ పెట్టి మరీ లెక్కలు సరిచేస్తానంటూ పవన్ చెప్పారు. దాంతో ఈ కామెంట్ల వెనుక పవన్ వ్యూహమేంటనే చర్చ జరుగుతోంది.