కాశీ యాత్రలో అకీరా నందన్.. నెట్టింట వైరల్!

81చూసినవారు
కాశీ యాత్రలో అకీరా నందన్.. నెట్టింట వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అతడి లుక్స్, అతడి లివింగ్ స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంటారు. ఈ క్రమంలోనే తాజాగా అకీరా ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో చూస్తే.. పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కాశీలో అకీరా నందన్ పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి గంగానదిపై ఓ పడవలో కూర్చొని అకీరా వెళ్తున్నట్లు ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్