AP: బీసీల నామ సంవత్సరంగా 2025 కూటమి పాలన ఉంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బీసీల నిధులను దారి మళ్లించిన ఘనత జగన్‌దేనని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిందని వివరించారు. సీఎం చంద్రబాబు పాలనలో బీసీలకు పెద్ద పీట వేశారని, బీసీల సంక్షేమానికి రూ.39,007 కోట్లతో నిధులు కేటాయించిందన్నారు.