వినికిడి సమస్య (చెవుడు) లేని ఆంధ్రప్రదేశ్ గా మారుస్తామని శ్రీసత్యసాయి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ వో సెల్వియా సల్మాన్ అన్నారు. ధర్మవరం నియోజకవర్గంలోని మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్, ఆశా కార్యకర్తలతో మంగళవారం ధర్మవరంలో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో వినికిడి లేని వారిని గుర్తించి నివేదికను తయారు చేయాలని సూచించారు. వీరందరికి 25న ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వినికిడి పరీక్షలు చేస్తామని వెల్లడించారు.