ఉబ్బసం వ్యాధి చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరిని ఇబ్బందులు పెడుతుంటుందని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి సీనియర్ డాక్టర్ నజీర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఉబ్బస వ్యాధి రాకుండా ఉండాలంటే ఇంట్లో బొద్దింకలు లేకుండా చూసుకోవాలని, పెంపుడు జంతువులు పడుకునే ప్రదేశాలను శుభ్రంగా ఉంచి, వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలన్నారు. ఉబ్బసం వ్యాధి వస్తే ఇన్హేలర్ లు వాడి ఉపశమనం పొందవచ్చు అని పేర్కొన్నారు.