ధర్మవరం: పాఠశాల భవనాలు నిర్మించాలని మంత్రికి లేఖ

71చూసినవారు
ధర్మవరం: పాఠశాల భవనాలు నిర్మించాలని మంత్రికి లేఖ
ధర్మవరం పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల భవన నిర్మాణాలు చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం లేఖ రాశారు. ప్రయివేట్ భవనాల్లో పాఠశాలలు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఉన్న అంచనాలు సవరించి నిధులు విడుదల చేసి నిర్మాణాలు పూర్తి చెయ్యాలని సంబంధిత మంత్రిని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్