ప్రపంచంలోనే యువకుల జనాభా అత్యధికంగా ఉన్న దేశం భారతదేశం అని, నేటి యువత దేశ భావి భారత నిర్మాతలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆదివారం ధర్మవరం రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ ముద్దుబిడ్డ అన్నారు.