ధర్మవరం చెరువు నుంచి రావులచెరువు గ్రామ చెరువుకి మంగళవారం ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ చేతుల మీదుగా నీటిని విడుదల చేశారు. నీటిని విడుదల చేయడంతో రావులచెరువు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. పంటలను సంవృద్ధిగా పండిచుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, అసిస్టెంట్ ఇంజినీర్ అంజన్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.