TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కమలాపురం గ్రామంలో మంగళవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తానే పరమ శివుడిని అంటూ 15 ఏళ్ల బాలుడు హల్‌చల్ చేశాడు. అక్కడ ఆరడుగుల గొయ్యి తవ్వితే నందీశ్వరుడు, శివుడి విగ్రహాలు బయటపడతాయని అశోక్ అనే బాలుడు పూనకంతో ఊగిపోయాడు. దీంతో శివుడి విగ్రహాలు బయటపడితే గుడి కట్టిస్తామని, లేదంటే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.