తాడిమర్రి మండలంలోని చిత్రావతి రిజర్వాయర్ వద్ద పోలీసులు మంగళవారం బందోబస్తు నిర్వహించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం, సోమవారం రాత్రి, కర్ణాటక, జిల్లా ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ముందస్తు చర్యల్లో బందోబస్తు చేపట్టారు. రిజర్వాయర్ వైపు ప్రజలు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.