Mar 27, 2025, 10:03 IST/
పర్యటకుల జలాంతర్గామి మునక.. ఆరుగురి మృతి
Mar 27, 2025, 10:03 IST
ఈజిప్టులోని రేవు నగరమైన హుర్ఘడలో ఎర్ర సముద్రంలో పర్యటకుల జలాంతర్గామి మునిగిపోయింది. ఈ ప్రమాద సమయంలో సబ్మెరైన్లో దాదాపు 40 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వీరిలో ఆరుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలు అయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.