అరుణాచల్ ప్రదేశ్‌లోని బిచోమ్ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో స్వల్ప భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 2.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఇది తక్కువ తీవ్రత కలిగి ఉండటంతో పెద్దగా ప్రభావం చూపలేదని స్పష్టం చేసింది.