కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. "మేం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే కేసీఆర్ కుటుంబం చంచల్‌గూడ జైల్లో ఉండేది. ఎవరో డ్రోన్ ఎగురవేస్తే నాపై కేసు పెట్టి జైల్లో వేశారు. నా బిడ్డ పెళ్లికి మధ్యంతర బెయిల్‌పై వచ్చాను. అయినా ఈ 15 నెలల్లో మా ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు" అని అన్నారు.