గార్లదిన్నె: అంతర్రాష్ట్ర బైకుల దొంగ అరెస్ట్
గార్లదిన్నె పోలీసులు మరో కీలక విజయాన్ని సాధించారు. ఏపీ, కర్నాటకలో బైకులు దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర బైకుల దొంగ శంకర్ సాయిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 24 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాల మొత్తం విలువ సుమారు రూ. 15 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. సంజీవపురంకి చెందిన శంకర్ సాయి, జల్సాలకు అలవాటు పడి, తాను కావాల్సిన ఖర్చులను తీర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ, క్రమంగా బైకుల దొంగగా మారాడన్నారు.