కామారెడ్డి: అపజయోత్సవాలు నిర్వహించుకోవాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

57చూసినవారు
కామారెడ్డి: అపజయోత్సవాలు నిర్వహించుకోవాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఏడాది పాలనపై రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాలు కాదని, అపజయోత్సవాలు నిర్వహించుకోవాలని దీక్ష దివస్ జిల్లా ఇన్చార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మంగళవారం ఆయన కామారెడ్డి శివారులో దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహణపై నాయకులతో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. హాస్టల్లో విద్యార్థులకు విషపూరితమైన ఆహారాన్ని పెడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్