గార్లదిన్నె: మైనార్టీ గురుకుల పాఠశాల భవనాలు నిర్మించండి
గార్లదిన్నె మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలకు సొంత భవనాలను కేటాయించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్ గురువారం డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. 440 మంది విద్యార్థులు ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాలలో సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే శాశ్వత భవనాలు నిర్మించాలన్నారు.