పసిడిపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించడం, పండగ సీజన్ వేళ పెరిగిన డిమాండ్ కారణంగా మన దేశ బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఆగస్టు నెలలో దిగమతులు రెట్టింపు అయ్యాయి. గతేడాది ఆగస్టులో 4.83 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకోగా.. ఈ ఏడాది 10.06 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది.