జానీ మాస్టర్‌ను డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగింపు: ఫిల్మ్ ఛాంబర్

81చూసినవారు
జానీ మాస్టర్‌ను డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగింపు: ఫిల్మ్ ఛాంబర్
అసిస్టెంట్ డ్యాన్సర్‌పై అత్యాచారం ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. డాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవితో పాటు అసోసియేషన్ నుంచి ఆయనను తాత్కాలికంగా తొలగిస్తూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. విచారణ పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. ఇదే కేసులో ఆయనను జనసేన పార్టీ సస్పెండ్ చేసింది.

సంబంధిత పోస్ట్