గుత్తి-పెండేకల్లు రైల్వే డబుల్ లైన్ పనుల కొరకు కేటాయించిన చెట్నేపల్లి సమీపంలోని భూములను జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన డబుల్ లైన్ కొరకు సేకరించిన, కేటాయించిన భూములకు సంబంధించిన మ్యాపులను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఓబులేసు, రైల్వే సెక్షన్ ఆఫీసర్ విమలేష్ కుమార్, సర్వేయర్ శేష సాయి, తదితరులు పాల్గొన్నారు.