గుత్తి: భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

58చూసినవారు
గుత్తి: భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
గుత్తి పట్టణంలో కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయంలో వేకువ జామున స్వామి వారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో వేదమంత్రాలు నడుమ అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో కార్తీకదీపం వెలిగించి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. శివనామస్మరణతో శివాలయాలు మారుమోగాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్