కళ్యాణదుర్గం పట్టణంలోని కోటవీధిలో వెలసిన శ్రీ పట్టాభి రామస్వామి దేవాలయానికి చెందిన ఉత్సవ రథానికి ఆదివారం మరమ్మత్తులు చేపట్టారు. ఫిబ్రవరి మాసంలో రథోత్సవ వేడుకలు ఉన్నందున ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక కలప తీసుకువచ్చి మరమ్మతులు చేపట్టినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపింది. రథోత్సవ మరమ్మతులకు స్థానిక ప్రముఖులు ఆర్థిక సహకారాలను అందజేసినట్లు పేర్కొన్నారు.