కళ్యాణదుర్గం మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో నడపడమే మా లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. శనివారం మున్సిపాలిటీలోని డంపింగ్ యార్డు వద్ద చెత్తను రీసైక్లింగ్ చేసి తడి, పొడి చెత్తలను వేరు చేసేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మంజూరైన లెగసి వేస్ట్ క్లియరెన్స్ మిషన్ ను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.