కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని రైతులకు 114 చెరువులకు సాగునీరు ఇచ్చి శాశ్వత కరువుకు పరిష్కారం చూపుతామని, ఎన్నికలలో ఇచ్చిన హామీని రెండేళ్లలో పూర్తి చేస్తామని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం ప్రజా వేదికలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కూడా బీటీపీ ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు.