మడకశిర ప్రాంతంలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతం మురరాయనపల్లి గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హిందుపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.