Apr 08, 2025, 00:04 IST/
అహ్మదాబాద్లో నేటి నుంచి ఏఐసీసీ సమావేశాలు
Apr 08, 2025, 00:04 IST
ఏఐసీసీ (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ) మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్ వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో సంస్థాగత మార్పులు అలాగే పార్టీకి పునర్ వైభవాన్ని తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పనితీరు మెరుగుపడినా ఆ తర్వాత జరిగిన హరియాణా, మహారాష్ట్ర, దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో ఈ సమావేశాలు జరగబోతున్నాయి.