ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ సాధించారు. తిలక్ వర్మ 26 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. తిలక్ వర్మ ఐపీఎల్‌లో కెరీర్‌లో ఇది 7వ అర్థశతకం. ఈ సీజన్‌లో తిలక్ వర్మ కు ఇది తొలి హాఫ్ సెంచరీ. దీంతో 17 ఓవర్లు పూర్తయ్యేసరికి MI స్కోర్ 181/4గా ఉంది. క్రీజులో తిలక్ (56), హార్దిక్ (35) ఉన్నారు.