గుజరాత్‌లోని వడోదరలో ఓ కారు డ్రైవర్ సోమవారం మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. ఖోడియార్‌నగర్ ప్రాంతంలో రోడ్డుపై ఇష్టానుసారంగా కారు నడిపి 5 వాహనాలను ఢీకొట్టాడు. స్కూటర్‌పై వెళ్తున్న ఓ జంటను ఢీకొట్టడంతో వారు కింద పడి గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు స్పందించి ఆ కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అతడిని అప్పగించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.