కియో అనుబంధ సంస్థ అడాప్ట్ ఆటో కంపోనేట్ ఫ్యాక్టరీ యజమానిపై చర్యలు తీసుకొని కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సీఐటీయూ నాయకులు కోరారు. సోమందేపల్లి మండలం చాలుకూరు వద్ద ఉన్న ఫ్యాక్టరీలో రాత్రి సమయంలో ఇద్దరు సురాజ్ గోస్వామి, ఉమేష్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని మెరుగైన వైద్యం అందించాలని పెనుకొండ ఆర్డీవో కార్యాలయంలో ఏవో గిరికి సీఐటీయూ నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు.