అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం సంజయ్ నగర్ కు చెందిన చేనేత కార్మికుడు బుద్ధి ఓంశేఖర్ అప్పుల బాధతో చేనేత మార్గానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు చేనేత ఐక్య వేదిక జాతీయ కార్యవర్గ సభ్యులు రాష్ట్ర నాయకులు నీలూరి రుసింగప్ప కోరిక మేరకు వీవర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరపున ఆర్థిక సాయం చేయాలని ముందుకు వచ్చారు. తద్వారా మృతి చెందిన ఓంశేఖర్ భార్య సరళ కు 5500 రూపాయల చేనేత ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు చేతుల మీదుగా ఆదివారం ఉదయం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో రుసింగప్ప మాట్లాడుతూ.. మృతి చెందిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా చేనేత కార్మికులు ఎవరు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని ఎవరికి ఏ ఆపద వచ్చినా తక్షణమే స్పందించి సహాయం చేయడానికి చేనేత ఐక్య వేదిక ముందు ఉంటుందని ఏవైనా సమస్యలు ఉన్నా వెంటనే చేనేత ఐక్య వేదిక నాయకులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ చేనేత ఐక్య వేదిక జాతీయ నాయకులు జల్లా కార్తీక్, రాష్ట్ర నాయకులు, నీలూరి రుసింగప్ప, దాతలు అయిన వీవర్స్ ఉద్యోగుల వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.