నిబంధనలకు విరుద్ధంగా అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు

998చూసినవారు
నిబంధనలకు విరుద్ధంగా అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు
గోరంట్ల మండల పరిధిలోని హైపర్ సెన్సిటివిటీ అయిన కొండ్రెడ్డిపల్లి, ఎర్రయ్యగారి పల్లి, సిరగం వాండ్ల పల్లి గ్రామాలకు స్థానిక సీఐ జయ నాయక్ తన పోలీసు సిబ్బందితో వెళ్లి అక్కడి ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి, స్థానిక ఎన్నికలు నాలుగవ విడత లో భాగంగా 21వ తేది ఎన్నికలు జరుగు రోజు నియమ నిబంధనలు పాటించాలని, నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐ జయ నాయక్ మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్ కి వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇళ్లల్లో ఏ రాజకీయ నాయకులు కూడా ఉండకూడదని, ఓటు వేయడానికి వెళ్లే వ్యక్తులు ఎవరు కూడా శానిటైజర్లు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, సెల్ ఫోన్, మరే ఇతర హానికరమైన వస్తువులను తీసుకెళ్లకూడదని, రౌడీషీటర్లు కానీ సస్పెక్ట్ / కిడ్స్ / డిసి'స్ గాని, నేర చరిత్ర కలిగిన ఏ వ్యక్తి కానీ ఏజెంట్ గా ఉండడానికి వీలులేదని, ఏజెంట్ గా ఉన్న వ్యక్తి పదే పదే బయటికి రాకూడదని, ఒకసారి బయటికి వస్తే తిరిగి లోపలికి అనుమతించబడరని, ఎవరూ కూడా తప్పుడు ప్రచారాలు, హింసను ప్రేరేపించడం గాని చేయకూడదని, ఎన్నికల్లో నామినేషన్ వేసినటువంటి వ్యక్తులు తనకు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ ఓటు వేసే సమయంలో ప్రతి ఒక్కరు క్యూ లైన్ లో ఉండి పోలీసు వారికి సహకరించాలని,
క్యాండిడేట్లు ( అభ్యర్థులు) ఎవరూ కూడా ఓటింగ్ వేసే ప్రదేశం లోకి పదేపదే రాకూడదని, ఒక గ్రామంలో ఓటు హక్కు లేని వ్యక్తి ఆ గ్రామంలో ఉండకూడదని ఎలక్షన్ సమయంలో ఎవరయినా గొడవలకు పాల్పడితే వారిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం గాని, డబ్బులు గానీ , బహుమతులు గాని పంచరాదని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్స్ ను చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడుతుందని, ప్రతి ఒక్కరూ ఎన్నికలు ప్రశాంతంగా జరపడానికి సహకరించాలని తెలియజేశారు. అదే విధంగా ఆ గ్రామల లోని పోలింగ్ బూతులను తనిఖీ చేయడం కూడా జరిగగింది. ఈ కార్యక్రమంలో సీఐ జయ నాయక్ తో పాటు ఎస్ ఐ ఇసాక్ బాషా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్