కొత్తచెరువు మండలంలో అతిసార వ్యాప్తి కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలో పలు అతిసార వ్యాధితో బాధపడుతూ పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వెళుతున్న అంశంపై స్పందించిన ఎమ్మెల్యే పల్లె సింధూర బుధవారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడారు. పంచాయతీ అధికారులు గ్రామాలకు నివారణ చర్యలు చేపట్టాలన్నారు.