జిల్లా ఎస్పీ వి.రత్న ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. సాయంత్రం వేళ పోలీసులు రోడ్డుపైకి వచ్చి, విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ప్రధాన రహదారులు, హైవేలు ముఖ్యమైన కూడళ్లలో వాహనాలు తనిఖీలు చేస్తూ రోడ్డు భద్రత నియమాలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తూ, ట్రాఫిక్ నియమాల పై అవగాహన చేపట్టారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలియజేశారు.