రాప్తాడు మండలం బండమీదపల్లి గ్రామం ఎర్రగుంట్ల వద్ద వెలసిన చెన్నకేశవ స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం కార్తీక మాసం సందర్భంగా స్వామి వారిని తమలపాకు ఆకులు, పూలమాలలతో అలంకరించి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పూజారి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్థులు చైతన్య తదితరులు పాల్గొన్నారు.