నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. దంచి కొట్టిన వర్షం.. రాకపోకలు బంద్

84చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి వర్షం దంచికొట్టింది. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే కనేకల్ మండలం మాల్యం గ్రామంలో భారీగా వర్షం నమోదు కావడంతో మాల్యం కనేకల్ వేదావతి హగరినందు నీటి ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు కూడా ధ్వంసమైనట్టు స్థానికులు తెలిపారు. భారీగా వర్షాలు నమోదు అవుతుండడంతో రైతన్నల ముఖాల్లో ఆనందం నెలకుంది.