EPFO తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. FY2023-24 కోసం EPF నిల్వలపై 8.25 శాతం వడ్డీని ఖరారు చేసినట్లు EPFO ప్రకటించింది. FY2023 తోపాటు FY2024-25 ప్రారంభంలో ఫైనల్ సెటిల్‌మెంట్ చేసుకున్న వారికి ఈ వడ్డీ రేటును చెల్లిస్తామని పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఖాతాదారులకూ ఇదే వడ్డీ అందుతుందని తెలిపింది. ఇది ఇటీవలి సంవత్సరాలలో అత్యధిక వడ్డీ అని మరియు స్మాల్ స్కేల్ సేవింగ్స్, GPF&PPF రేట్లతో పోలిస్తే ఇది ఎక్కువ అని ట్వీట్ చేసింది.