రాయదుర్గం: ప్రధాన రోడ్లపై హడలెత్తిస్తున్న గాడిదలు

4002చూసినవారు
రాయదుర్గం పట్టణంలో ప్రధాన రోడ్లపై ఆవులు మంద సంచారం అధికంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు గాడిదలు సైతం ప్రధాన రోడ్లపై వాహనదారులకు తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం స్థానిక బస్టాండ్ సమీపాన ప్రధాన రోడ్లపై గాడిదల పోట్లాట వాహనదారులకు భయాందోళనకు గురి చేసింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్