నార్పల మండల కేంద్రంలోని కోటవీధికి చెందిన మహిళలు నార్పల పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో గురువారం ధర్నా చేశారు. 30 రోజులుగా నీళ్లు రాక చాలా అవస్థలు పడుతున్నామని వారు ఆరోపించారు. అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. నీటిని సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ధర్నా విరమించారు.