సింగనమల చెరువు నుండి అనంతపురం అమరావతి 6వే రోడ్డు పనులకు ఎటువంటి అనుమతి లేకుండా నీటిని తరలించడం అన్యాయమని సింగనమల రైతుల ఆధ్వర్యంలో చెరువు వద్ద నీటి ట్యాంకర్లకు అడ్డుగా నిలబడి బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎటువంటి అనుమతి లేకుండా నీటిని తోలుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.