శింగనమల: చిరుత దాడిలో మూడు గొర్రెలు మృతి
శింగనమల మండలంలోని గోవిందరాయునిపేట గ్రామ సమీపంలో చిరుతపులి హల్చల్ చేసింది. దాడి చేసి మూడు గొర్రెలను చంపేసింది. పశువుల కాపరి సూరి వివరాల మేరకు శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గొర్రెల మందపై చిరుత పులి దాడి చేసిందని అన్నారు. ఈ దాడిలో ఒక గొర్రె, రెండు గొర్రె పిల్లలు మృతి చెందాయని తెలిపారు. పశువుల కాపరి వెంటనే అప్రమత్తం కావడంతో వెళ్లిపోయింది. ఆయన అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.