సింగనమల మండల పరిధిలోని తరిమెలలో ఇసుక రవాణా జరుగుతుందన్న నేపథ్యంలో అనంతపురం రూరల్ డిఎస్పీ వెంకటేశులు మంగళవారం పెన్నానది ఒడ్డున అక్రమంగా ఇసుక రవాణా చేయకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. హిటాచీలు, జేసీబీలు, టిప్పర్లు, భారీ వాహనాలు లాంటివి పెట్టి అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నవారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు.