తాడిపత్రి పట్టణంలో మట్కా నిర్వహిస్తున్న ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 55 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సీఐ సాయిప్రసాద్ శుక్రవారం తెలిపారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మట్కా నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న సీఐ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.