పెద్దవడుగూరు లోని స్థానిక పేట శివాలయం వద్ద సోమవారం ద్విచక్రవాహనం ఢీకొని సుభాష్ అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నవడుగూర గ్రామానికి చెందిన లక్ష్మి పెద్దవడుగూరుకు వస్తుండగా శివాలయం వద్ద సుబాష్ అనే బాలుడు రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన బాలుడిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.