తాడిపత్రి పట్టణ పరసరాల్లో కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ నాయుడు తెలిపారు. కర్ణాటక మద్యాన్ని అమ్ముతున్నారని సమాచారం రావ డంతో దాడులు నిర్వహించగా అడివిరెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న 40 మధ్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ వివరించారు.