కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి. తిరుమల లడ్డూ తింటే ఆ దేవుడి అనుగ్రహం ఉన్నట్లేనని భక్తుల నమ్మకం. ఈ లడ్డూ తయారీకి ప్రత్యేకత ఉంటుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, పటిక బెల్లం, శనగపిండి, జీడిపప్పు, యాలకులు, ఎండు ద్రాక్ష, స్వచ్ఛమైన కర్పూరం వాడుతారు. అయితే ఇప్పుడు ఈ లడ్డూపై హిందువుల విశ్వాసాలకు భంగం వాటిల్లేలా ఆరోపణలొస్తున్నాయి. లడ్డూలో జంతువుల కొవ్వు, చేపల నూనె వాడినట్లు స్వయంగా సీఎం చంద్రబాబే చెప్పడంతో భక్తులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.