వెదురుకుప్పం: మా దారి సమస్యను పరిష్కరించండి సారు
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం తిరుమలయ్య పల్లికి చెందిన వినాయకరెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ ను కలిశారు. తన తండ్రికి ముగ్గురు సంతానం ఉన్నారని, తన పూర్వీకుల ఆస్తిలో 25 సెంట్ల భూమిలో తన భాగానికి ఉన్న ఇంటికి దారి సమస్య ఉందని, ఆ సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ను కొరగా ఆ సమస్యను సవివరంగా తెలుసుకున్న కలెక్టర్ సంబంధిత ఎమ్మార్వో అని పిలచి ఆ సమస్యను పరిశీలించమన్నారు.