కమలాపురం నియోజకవర్గంలో 2 వేల ఎకరాలలో పంట నష్టం

57చూసినవారు
కమలాపురం నియోజకవర్గంలో 2 వేల ఎకరాలలో పంట నష్టం
ఇటీవల కురిసిన భారీ వర్షాల దాటికి కమలాపురం నియోజకవర్గంలో 2 వేల ఎకరాలలో పంట నష్టం వాటిలినట్లు అధికారులు ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డికి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే కమలాపురం మండలంలోని గంగవరం గ్రామంలో అధిక వర్షాలకు నేల వాలిన వరి పంటను పరిశీలించారు. చేతికి వచ్చిన పంట నేలపాలు అయిందని రైతులు ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి సమస్య తీసుకుని వెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.