కమలాపురం: చెత్తా చెదారానికి కొలువైన ఇందిరమ్మ కాలనీ
కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ చెత్తా చెదారానికి కొలువైంది. గత కొద్ది నెలలుగా చుట్టుపక్కల నివసించే ప్రజలందరూ ఆరుబయటే చెత్తను వేస్తున్నారు. దీన్ని తొలగించండానికి నగర పంచాయతీ సిబ్బంది ఇటువైపు రావడం లేదని స్థానికులంటున్నారు. ఏదైనా సమస్యను పత్రికల ద్వారా తెలియజేస్తేనే ఆ రోజుకి మాత్రం అధికారులు స్పందిస్తున్నారని.. తర్వాత ఇటువైపు చూసి చూడనట్టు ఉంటున్నారని ప్రజలు వాపోతున్నారు.