మకర సంక్రాంతి సందర్భంగా మంగళవారం కడప శిల్పారామంలో ఘనంగా మకర సంక్రాంతి సంబరాలను శిల్పారామం పరిపాలనాధికారి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సాయంత్రం కమలాపురం మండలం చదిపిరాల గ్రామము వారు డప్పులతో వాయిద్యములతో శిల్పారామంలో వాయించినారు. గంగిరెద్దుల ఆటలను ప్రదర్శించారు. అనంతరం సాంస్కృతిక కళావేదిక మీద మిస్ఫా మూవీ సహకారంతో బద్వేల్ కు చెందిన భవాని డాన్స్ బృందం డాన్సులతో ప్రేక్షకులను అలరించారు.