చెన్నూరు: గురుకుల పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి
కమలాపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడడం, పాఠశాల సిబ్బంది ఆ అమ్మాయిని ఆస్పత్రికి తరలించి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి గుమ్మల సాయికుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో అసలేం జరుగుతోంది, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు.