ఎర్రగుంట్ల: ఆదమరిస్తే.. ప్రమాదంలో పడాల్సిందే
కమలాపురం - పోట్లదుర్తి రోడ్డు మార్గాన ప్రయాణం ప్రమాదకరంగా ఉందని పలువురు వాహనదారులు వాపోతున్నారు. ఎర్రగుంట్ల మండలం బిస్మిల్లాబాద్ సమీపాన రోడ్డు మధ్యలో ఎర్పడ్డ పెద్ద గోయ్యిలో పడి పలువురు వాహనదారులు ప్రమాదానికి గురి కావడంతో. గమనించిన స్థానికులు గోతికి అడ్డుగా కంప, అట్టలు పెట్టారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఏర్పడిన గోతిని పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.